Author: voiceofnagarkurnool@gmail.com

శివాజీ జయంతి సందర్భంగా 43 యూనిట్ల రక్తదానం

శివాజీ జయంతి సందర్భంగా తిమ్మాజిపేటలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 43 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

నాగర్‌కర్నూల్‌లో బిఎస్పీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నేతలు తెలిపారు.

మానవత్వం మంట కలిసిన ఘటన

నాగర్‌కర్నూల్ చెరువులో నాగనోలు గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించిన ఘటన ప్రజలను కలచివేసింది. అంబులెన్స్ లేమిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

TNGO 2026 డైరీ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు మార్చి 16న పోలింగ్ జరగనుంది.

మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని

శివరాత్రి రోజు గంజాయి సమర్పణ

శివరాత్రి రోజున శంషాబాద్ ధర్మగిరి శివాలయంలో కొందరు యువకులు గంజాయి సమర్పిస్తూ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ పర్యటన

మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా స్వాగతం పలికారు.