Author: voiceofnagarkurnool@gmail.com

కుమ్మెర ఘటనపై బీఆర్ఎస్ స్పందన

కుమ్మెర జాతర ఘటనలో పసిపాప మృతి నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రేపు నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు కుమ్మెర గ్రామంలో బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.

ఉద్యోగులు–పెన్షనర్లకు ఆరోగ్య పథకం

ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది. కోటి బీమా, 010 పద్దు జీతాలు వంటి ఉద్యోగ అనుకూల విధానాలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం

కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక

రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 60 కేంద్రాల్లో 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, భద్రత, మౌలిక వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు.

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరుకు టిడబ్ల్యూజేఎఫ్ వినతి

నాగర్ కర్నూల్‌లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం

కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.