Author: Kishore Hakeem

కుమ్మెర ఘటనపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆగ్రహం

కుమ్మెర గ్రామ ఘటనలో చిన్నారి మృతి నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. నిందితులను శిక్షించకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఆనంద్ గౌడ్ హెచ్చరించారు.

కొల్లాపూర్‌లో శివాజీ జయంతి వేడుకలు

కొల్లాపూర్‌లో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యాస రచన పోటీలు, విద్యార్థులకు బహుమతులు, పాలిటెక్నిక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే

కుమ్మెర గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే డా. రాజేశ్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

శ్రీపురంలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం

శ్రీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 34 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. లీకేజీలు, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.

భూసేకరణ వేగవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేసి నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.

రేపే నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం

నాగర్‌కర్నూల్‌లో రేపు నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగనుంది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ 18, విపక్ష భారత రాష్ట్ర సమితి 6 సీట్లు సాధించగా, చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.