రేపే నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
నాగర్‌కర్నూల్‌లో రేపు నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగనుంది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ 18, విపక్ష భారత రాష్ట్ర సమితి 6 సీట్లు సాధించగా, చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
నాగర్‌కర్నూల్‌లో రేపు నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగనుంది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ 18, విపక్ష భారత రాష్ట్ర సమితి 6 సీట్లు సాధించగా, చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోతుల మమత సుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
వెన్నచర్ల పీహెచ్సీలో వైద్యుల విధుల నిర్లక్ష్యంపై డాక్టర్ ప్రశాంత్పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం
నాగర్ కర్నూల్లో మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించి పెండింగ్ హామీలన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తెలిపారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
నాగర్ కర్నూల్ మునిసిపల్ ఎన్నికల్లో 21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడిగే రవీందర్ను గెలిపిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి అన్నారు.
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఎండబెట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.