డెంటల్ విద్యను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి అతిథులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య వృత్తి సమాజానికి సేవ చేయడానికి అత్యంత గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి గొప్ప బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. విద్య పూర్తి చేసిన యువ వైద్యులు తమ జ్ఞానాన్ని సమాజ సేవకు అంకితం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ఆర్మీ అధికారులు, అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ అతిథులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.: హైదరాబాద్‌లో Army College of Dental Sciencesలో సిల్వర్ జూబ్లీ


