అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరియు మాజీ మంత్రులు బిఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి కుట్రలు చేస్తున్నారని వాటిని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. సిట్ అధికారులు కెసిఆర్ కు నోటీసులు జారీ చేయడం పై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాంటి ఆధారాలు లేని ఫోన్ టాపింగ్ కేసులో ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు సిట్ అధికారులు చేస్తున్నారని పార్టీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం మొత్తం ఉందని అన్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.: అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. Post navigation బహుజన సమాజ్ పార్టీ ఆరవ వార్డు అభ్యర్థిగా కళ్యాణ్ 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బాదం రమేష్ నామినేషన్ దాఖలు