నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాదం రమేష్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహకారంతో స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.: 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బాదం రమేష్ నామినేషన్ దాఖలు Post navigation అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. చేసిన అభివృద్ధితోనే విజయం సాధిస్తా…