నాగర్ కర్నూల్ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ

శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పోలీస్ పరేడ్‌ను పరిశీలించిన కలెక్టర్, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ పరేడ్, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *