
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిజిటల్ మీడియాను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పటేల్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గార్ల గౌరవ హస్తాల మీదుగా నిర్వహించారు.జిల్లాలో ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయాలనే లక్ష్యంతో వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిజిటల్ మీడియాను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిజమైన వార్తలను నిర్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సత్యవార్త జిల్లా ప్రతినిధి బాదం పరమేష్, బతుకమ్మ టీవీ ప్రతినిధి రమణకుమార్, చిగుళ్లపల్లి ప్రాంతానికి చెందిన ప్రతినిధులు, అలాగే బుశెట్టి వివేక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలా వార్తల ప్రసారం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
