
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా, మొత్తం జనాభా 35,378గా ఉంది. ఇందులో 17,918 మహిళలు, 17,460 పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 49 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ మరియు కౌంటింగ్ తేదీలను ఖరారు చేశారు.* ఎన్నికల షెడ్యూల్ వివరాలు:నామినేషన్ల స్వీకరణ:28-01-2026 ລ້໖ 30-01-2026 ລ້నామినేషన్ల పరిశీలన: 31-01-2026నామినేషన్ల ఉపసంహరణ: 03-02-2026పోలింగ్ తేదీ:11-02-2026ఓట్ల లెక్కింపు (కౌంటింగ్):13-02-2026నామినేషన్లను 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీలలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.ఈ వివరాలను నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కమిషనర్ బి. నాగిరెడ్డి అధికారికంగా ప్రకటించారు.
