నాగర్ కర్నూల్ పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి 7, 20, 18, 17, 15, 3 వార్డులలో పర్యటించి కొత్త సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రారంభించడం జరిగింది. మరియు అవసరం ఉన్నచోట వాటి నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే నాగర్ కర్నూల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలబెడతానని, అత్యధిక నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రాబోయే రోజుల్లో పట్టణంలో అన్ని వార్డులలో సీసీరోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు పూర్తి చేస్తామని…
పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనైజ్ పనులు ఇప్పటికే పూర్తి కావస్తున్నాయని, మంచి నీటి అవసరాలకు గాను అమృత్ 2.0 కింద అన్ని వార్డులకు తాగునీటి పైప్ లైన్ వసతి కూడా కల్పిస్తున్నామని..
తాను ఎప్పుడూ కూడా ప్రజల కోసం పని చేస్తానని, తాను ప్రజల మనిషినని ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా క్యాంప్ ఆఫీస్ కు వచ్చి తనను కలవచ్చని
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి పెద్ద ఎత్తున గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరడం జరిగింది.
ఎమ్మేల్యే గారితో పాటు పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా వార్డుల ప్రజలు ఉన్నారు.
