నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడి ఘటన చోటుచేసుకుంది. అడవి సమీపంలో మేతకు వెళ్లిన లేగదూడపై చిరుత దాడి చేయడంతో అది మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ ఘటనతో రంగాపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచరిస్తోందన్న సమాచారంతో అడవి సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ దాడిలో లేగదూడను కోల్పోయిన యజమాని లక్ష్మణ్కు నష్టపరిహారం చెల్లిస్తామని అటవీ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ, అడవి సమీప ప్రాంతాల్లో పశువులు, మేకలు, గొర్ల మందలను (దొడ్లు) ఏర్పాటు చేయవద్దని రైతులకు సూచించారు. అలాగే అడవిలోకి అనవసరంగా వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళ అత్యంత అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.చిరుత సంచారాన్ని గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.: నల్లమల అడవిలో చిరుత దాడి… లేగదూడ మృతి, గ్రామస్తుల్లో భయాందోళన Post navigation నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సూరపూర్ గ్రామంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన – అభివృద్ధి పనులకు శ్రీకారం