నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలూరు విజయలక్ష్మి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలతో మాజీ కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో వార్డులో అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.: చేసిన అభివృద్ధితోనే విజయం సాధిస్తా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *