కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలి…… ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి……….. నాగర్ కర్నూల్ ………….మునిసిపల్ ఎన్నికలలో రెండవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి శ్రీనివాసులు నామినేషన్ పత్రాలను అసంపూర్తిగా దాఖలు చేశారని దానిని ఎన్నికల అధికారులు తిరస్కరించాలని బిఆర్ఎస్ అభ్యర్థి తిమ్మాజీపేట పాండు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు ప్రభుత్వ వాటాదనంతో కొనసాగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సీఈఓ గా విధులు నిర్వహిస్తూ రాజీనామాలు ఆమోదించకుండానే ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారని దానిని నిశితంగా పరిశీలించి తిరస్కరించాలని కోరారు. ప్రతినెల దిది నిర్వహణలకు గాను 45 వేల రూపాయల వేతనం పొందుతున్నారని బ్యాంకుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మరియు ఆడిట్ రిపోర్ట్ బ్యాంకు ఖాతా నివేదికలను సమర్పించిన అనంతరమే రాజీనామా ఆమోదిస్తారని అధికారికి వివరించారు సదరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు ఖాతాలను అధికారులకు సమర్పించి రాజీనామా ఆమోదించకుండానే నామినేషన్ దాఖలు చేయడం ఆమోదించిన రాజీనామా ప్రతిని నామినేషన్ పత్రంలో జతపరచవలసి ఉంటుందని ఇవేవీ లేకుండా దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు పై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సరైన సమాధానం తెలపడం లేదని నామినేషన్ తిరస్కరించకపోతే జిల్లా ఎన్నికల అధికారికి మరియు రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు: కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *