*యశోద మలక్‌పేట్ వైద్య బృందం అరుదైన విజయం*
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణాలను యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్ న్యూరో సర్జరీ వైద్య బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా కాపాడింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీకి గురైన బాధితుడికి గోల్డెన్ అవర్స్‌లో సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా చీఫ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. సయుజ్ కృష్ణన్ ఎస్ మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే తీవ్రమైన మెదడు గాయాలు అత్యవసర వైద్య పరిస్థితులు. వేగవంతమైన స్కానింగ్, సకాలంలో డీకంప్రెసివ్ న్యూరో సర్జరీ, నిరంతర న్యూరో ఐసీయూ పర్యవేక్షణ వల్లే ఈ రోగిని కాపాడగలిగాం” అని తెలిపారు.
అత్యవసరంగా డీకంప్రెసివ్ క్రానియెక్టమీ, వెంటిలేటర్ మద్దతుతో కూడిన న్యూరో క్రిటికల్ కేర్ అందించామని, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి డిశ్చార్జ్ చేశామని తెలిపారు.
ఈ ఘటన యశోద మలక్‌పేట్‌ను విశ్వసనీయ న్యూరో ట్రామా రిఫరల్ సెంటర్‌గా మరోసారి నిలిపిందని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.: రోడ్డు ప్రమాద బాధితుడికి ప్రాణరక్షణ న్యూరో సర్జరీ
