ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలపరిచే లక్ష్యంతో వడ్డీ లేని రుణాలు అందించడం, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ఉచిత సోలార్ సిస్టమ్స్ మరియు బ్యాంకు రుణాల ద్వారా సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళా సాధికారతతోనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు, ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీతతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.: మహిళా సాధికారతతోనే ప్రభుత్వ లక్ష్యం







