వనపర్తి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. మున్సిపల్ చైర్మన్గా మీడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్గా గురకొండ మధుసూదన్ గౌడ్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించగా, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం చేత సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు.

33 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో 17 మంది కోరం అవసరం కాగా, సమావేశానికి 22 మంది హాజరయ్యారు. వీరిలో 20 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఇద్దరు స్వతంత్ర సభ్యులు పాల్గొన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం మాధవి పేరును ప్రతిపాదించగా, 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరచారు. ప్రత్యర్థి అభ్యర్థి లేకపోవడంతో మాధవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు మధుసూదన్ గౌడ్ పేరును ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరచడంతో వైస్ చైర్మన్ పదవికి కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం చేశా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో, తహసీల్దార్ రమేష్ రెడ్డి,కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో, తహసీల్దార్ రమేష్ రెడ్డి, ఎన్నికల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పత్యం స్పష్టంగా కనిపించింది.: వనపర్తి మున్సిపాలిటీ ఏకగ్రీవ ఎన్నిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *