కళాశాల యాజమాన్యం తెలిపిన ప్రకారం, క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదవడం వల్లే ఈ స్థాయి ప్రతిభ సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మాట్లాడుతూ, చిన్ననాటి నుండి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో క్రమబద్ధంగా చదవడం వల్లే ఈ ఫలితం సాధించానని తెలిపారు.
విద్యార్థి తండ్రి సందడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తన కుమారుడు రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఐటీలో సీటు సాధించి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు వివేకానంద రెడ్డిని అభినందించారు.: అత్యుత్తమ ప్రతిభతో మెరిసిన వివేకానంద రెడ్డి
