శ్రీ విశ్వవసు సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష ద్వాదశి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండల పరిధిలోని నందివడ్డేమాన్ గ్రామంలో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శని గ్రహ దోష నివారణార్థం భక్తులు వేదమంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో స్వామివారికి తిలతైలాభిషేకం చేశారు. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.

ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఫాల్గుణ మాసంలో స్వామివారిని భక్తితో కొలిచిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ రీత్యా, గోచార రీత్యా శని దోషాల నివారణకు ప్రతి ఒక్కరూ శక్తిమేరకు పూజలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.: శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *