Tag: Voice of Nagarkurnool

నాగర్‌కర్నూల్‌లో సమ్మె బాటలో విద్యుత్ స్పాట్ బిల్లర్స్

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్పాట్ బిల్లర్స్ సమ్మె కొనసాగుతోంది. పని దినాలు పెంచాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం

కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్‌లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకారం

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్‌గా షాన్ వాజ్ ఖాన్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

నాగర్‌కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 వార్డుల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ వార్డుల్లో 2 నుంచి 7 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.