Tag: Telangana Government

లట్టుపల్లిలో ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ చీరల పంపిణీ

లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు రెండు చొప్పున చీరలను అందజేశారు.

మార్చి 12న సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మార్చి 12న కొత్తగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. మొత్తం 44 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

చెంచుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్‌డీటీతో ఒప్పందం

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.