విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: వైద్యాధికారిణి డాక్టర్ వాణి
నాగర్ కర్నూల్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి డాక్టర్ వాణి సూచించారు.
