Tag: Kummera incident

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కుమ్మెర బాధితులను కలిసిన కవిత

కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.

కుమ్మెర ఘటనపై బీఆర్ఎస్ స్పందన

కుమ్మెర జాతర ఘటనలో పసిపాప మృతి నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రేపు నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు కుమ్మెర గ్రామంలో బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.

బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం

కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం

కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చిన్నారి హత్య ఘటనపై సీపీఎం ఆందోళన

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై సీపీఎం ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.

కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం

కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్‌లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

కుమ్మెర ఘటనపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆగ్రహం

కుమ్మెర గ్రామ ఘటనలో చిన్నారి మృతి నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. నిందితులను శిక్షించకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఆనంద్ గౌడ్ హెచ్చరించారు.