ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. మొత్తం 44 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
