నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ మణికంఠ గ్యాస్ట్రో & లివర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన విద్యార్థి శరత్ కుమార్ ప్రమాదవశాత్తు ఐదు రూపాయల నాణెం మింగాడు.
వివరాల ప్రకారం, శరత్ కుమార్ ఆటలాడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ జగదీష్ మణికంఠ ఆధ్వర్యంలో వైద్యులు బాలుడిని పరీక్షించి, నాణెం గొంతులో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.
తదుపరి వైద్యులు ఎండోస్కోపీ విధానాన్ని ఉపయోగించి, ప్రత్యేక పరికరాల సహాయంతో నాణెాన్ని సురక్షితంగా బయటకు తీసేశారు. చికిత్స అనంతరం బాలుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యుల చాకచక్యానికి బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చిన్నపిల్లలపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.: ఐదు రూపాయల నాణెం మింగిన విద్యార్థి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *