ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని శివాజీ సర్కిల్ వద్ద శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో యువజన సంఘ సభ్యులు మొత్తం 43 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కే. కవిత, శివాజీ యూత్ ప్రెసిడెంట్ బాలకృష్ణ ప్రారంభించారు. బాలకృష్ణ మాట్లాడుతూ నేటి యువతకు శివాజీ మహారాజ్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, సమాజ సేవే లక్ష్యంగా యువజన సంఘం ముందుకు సాగుతుందని తెలిపారు.

సేకరించిన 43 యూనిట్ల రక్తాన్ని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఈ రక్తాన్ని ఉచితంగా అందజేస్తామని బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ ఏ. రోహిత్ తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, యువజన సంఘ సభ్యులు మల్లేష్, శివ, రఘు, శ్రీశైలం, గ్రామస్తులు లక్ష్మీనారాయణ, వేణుగోపాల్ గౌడ్, మాధావులు, ప్రదీప్, రామ్మోహన్, లింగం, బద్రీనారాయణతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజ హితమే లక్ష్యంగా యువత చేసిన ఈ సేవకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.: శివాజీ జయంతి సందర్భంగా 43 యూనిట్ల రక్తదానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *