శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శంషాబాద్ పరిధిలోని ధర్మగిరి శివాలయంలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది యువకులు శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పిస్తున్నట్లు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ వీడియోలో ఆలయ ప్రాంగణంలో గంజాయిని చూపిస్తూ భక్తి పేరుతో ప్రదర్శన చేయడం కనిపించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మత్తు పదార్థాలను ఆధ్యాత్మికతతో కలపడం తగదని పలువురు విమర్శించారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమై వీడియో ఆధారంగా యువకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

ఆలయ పవిత్రతను కించపరిచేలా వ్యవహరించడమే కాకుండా, నిషేధిత మత్తు పదార్థాన్ని బహిరంగంగా ప్రదర్శించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత యువకులపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.: శివరాత్రి రోజు గంజాయి సమర్పణ

ఈ ఘటనతో శివరాత్రి వేడుకల ఆనందం కాస్తా వివాదంగా మారింది. మతపరమైన కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యువత సోషల్ మీడియాలో వైరాలిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *