నేటి సమాజంలో వ్యాప్తి చెందుతున్న మూఢనమ్మకాలను దూరం చేయడానికి శాస్త్రీయ పరిజ్ఞానం కీలకమని ప్రిజం పాఠశాల ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ పేర్కొన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రిజం పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రత్యేక విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. వ్యక్తిగతంగా మరియు బృందాలుగా మొత్తం 55 సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.

విద్యార్థులు రూపొందించిన మోడళ్లను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పరిశీలించారు. విజ్ఞానం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చని, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం అవసరమని టీ. నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ దేవేందర్, ఉపాధ్యాయులు భరత్, వసంత, రాజు, యాదగిరిరావు, సుస్మిత, రామకృష్ణ, సురేష్, పవన్, బలింద్ర నాయక్, సలీం, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.: శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *