భక్తులు ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు మాత్రమే జాతరను సందర్శించేందుకు అనుమతి ఉందని, అందరూ ఈ సమయాలను గమనించి యాత్రకు రావాలని సూచించారు. నల్లమల్ల లోతైన అటవీ ప్రాంతంలో దేవాలయం ఉండటంతో భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో కాకుండా పగటి వేళల్లో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు.
అలాగే భక్తులు నీటి బాటిళ్లు వెంట తీసుకురావడం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ శాఖ భక్తుల భద్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు మరియు అచ్చంపేట సబ్ డివిజన్‌కు చెందిన ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.: సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత



