జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డేమాన్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ రకాల సైన్స్ పరికరాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జి. మురళీమోనాచార్యులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

విద్యార్థులు రూపొందించిన మరియు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ పరికరాలు ఆకట్టుకున్నాయి. వాటి ఉపయోగాలు, ప్రాముఖ్యతను విద్యార్థులే వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, నూరుద్దీన్, రాజేశ్వర్ రెడ్డి శాస్త్ర విజ్ఞాన ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *