మార్చి 31న మంగళవారం శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర మాసం త్రయోదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు పరమశివునికి విశేష రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించబడతాయి. సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట, దీక్ష హోమం కార్యక్రమాలు జరుగుతాయి.
ఏప్రిల్ 1న బుధవారం చతుర్దశి సందర్భంగా శ్రీ జేష్టాదేవి సమేత శనేశ్వర స్వామికి శతకుంభ మహాన్యాస పూర్వక తిలతైల అభిషేకం, శనేశ్వర హవనం, మహా మంగళహారతి కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించబడతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు శనేశ్వర స్వామి కళ్యాణోత్సవం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 2న గురువారం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు ఉమామహేశ్వర స్వామి వ్రతం, శాంతి హోమం, బలిహరణ, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. సాయంత్రం 4 గంటలకు నంది వడ్డేమాన్ గ్రామంలో బండ్లు తిరుగుట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మూడు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో తీర్థప్రసాదాలు కూడా అందజేయబడతాయి.
అలాగే, ప్రత్యేక మహాన్యాస పూర్వక తిలతైల అభిషేక పూజలో భక్తులు ప్రత్యక్షంగా లేదా వర్చువల్ విధానంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం రూ.258/- ఫీజును 94402 31325 లేదా 8186821212 నంబర్లకు ఫోన్‌పే ద్వారా పంపి వాట్సాప్ ద్వారా వివరాలు పంపవలసిందిగా ఆలయ నిర్వాహకులు సూచించారు.
ఈ ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ శనేశ్వర స్వామి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.: శనేశ్వర స్వామి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం


