ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రతి పరీక్షకు మధ్య నాలుగు రోజుల విరామం ఉండటం విద్యార్థులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 10,683 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. 257 ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల తదితర పా ల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెడికల్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన పోలీస్ బందోబస్తు, ప్రత్యేక బస్సులు, జవాబు పత్రాల భద్రతా రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.: పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

