నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించిన వివరాల ప్రకారం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ:

పురుష ఓటర్లు 17,460 మందికి గాను 12,906 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మహిళా ఓటర్లు 17,918 మందికి గాను 13,265 మంది ఓటు వేశారు. మొత్తం 35,378 ఓటర్లలో 26,171 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 73.98 శాతం పోలింగ్ నమోదైంది.

కల్వకుర్తి మున్సిపాలిటీ:

పురుష ఓటర్లు 12,975 మందికి గాను 10,444 మంది, మహిళా ఓటర్లు 13,048 మందికి గాను 10,538 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 26,023 ఓటర్లలో 21,027 మంది ఓటు వేశారు. ఇక్కడ 80.80 శాతం పోలింగ్ నమోదైంది.
కొల్లాపూర్ మున్సిపాలిటీ:

పురుష ఓటర్లు 9,593 మందికి గాను 7,696 మంది, మహిళా ఓటర్లు 9,763 మందికి గాను 7,809 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 19,356 ఓటర్లలో 15,505 మంది ఓటు వేశారు. ఇక్కడ 80.10 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

ఓటింగ్ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ ↓ రూమ్లకు తరలించినట్లు అధిలు తెలిపారు.: మూడు మున్సిపాలిటీల్లో 73%కు పైగా ఓటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *