నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా కుల వివక్షతో ఆలయానికి వెళ్లిన వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ సర్పంచ్ పాటు అగ్రనాయకులపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన Hyderabad లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ B Shivadhar Reddy ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని, చిన్నారి హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిపై హత్య కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, సీహెచ్ ఉపేందర్, మాజీ ఎంపీపీ రాజు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి ఆనంద్, భరత్ గౌడ్, సుర్వి యాదయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.: కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *