నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు సీపీఎం మద్దతు ప్రకటించింది.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. సర్పంచ్తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం లేదా హత్య కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాలని విజ్ఞప్తి చేశారు.ఘటన జరిగి ఆరు రోజులు గడిచినా సరైన సెక్షన్లతో కేసులు నమోదు చేయలేదని పోలీసులపై విమర్శలు గుప్పించారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. నిందితులను రిమాండ్కు పంపకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, డీజీపీ దృష్టికి విషయం తీసుకెళ్తామని హెచ్చరించారు.

బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేష్, మౌనికలను సీపీఎం రాష్ట్ర బృందం పరామర్శించింది. బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం నేతలు ప్రకటించారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.: చిన్నారి హత్య ఘటనపై సీపీఎం ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *