జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజానికి ముఖ్యమైన సమాచారాన్ని అందించే బాధ్యతను నిర్వర్తిస్తున్నారని, వారికి అవసరమైన గుర్తింపు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అర్హతలు ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా ప్రతినిధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, కార్యదర్శి వెంకట్ స్వామి, కోశాధికారి బాదం పరమేశ్వర్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.: జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరుకు టిడబ్ల్యూజేఎఫ్ వినతి
