నాగర్కర్నూల్ జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ (శుక్రవారం) ఉదయం 10:30 గంటల నుండి భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళా నాగర్కర్నూల్ పట్టణంలోని నేషనల్ హై స్కూల్, మెయిన్ రోడ్, ఆర్టిసి బస్ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జరగనుంది.

ఈ మేళాలో సుమారు 50 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 25 నుంచి 30 రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్, డిగ్రీతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000/- పైగా జీతం లభించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ విద్యా సర్టిఫికెట్లు, రెజ్యూమే ప్రతులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం 9666974704, 9885462005 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.: జిల్లా స్థాయి భారీ ఉద్యోగ మేళా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *