నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ మొదటి పేపర్ పరీక్షా ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, పరీక్షలు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవకతవకలకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

పరీక్షా గదులను సందర్శించిన ఆయన, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షా గదుల పరిస్థితిని పరిశీలించారు. ప్రశ్నాపత్రాలు నిర్ణీత సమయానికే తెరిచారా? ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను 5 నిమిషాల్లోపు అనుమతించారా? అని సిబ్బందిని ప్రశ్నించారు.

కేంద్రంలో 197 మందికి గాను 193 మంది హాజరయ్యగా, 4 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 5968 మందిలో 5806 మంది హాజరై, 107 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.: ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *