నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా హెచ్‌పీవీ (HPV) టీకాను ప్రత్యేక శిబిరంలో వేస్తున్నట్లు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ పి. సృజన తెలిపారు.

ఆమె వివరాల ప్రకారం, 1 ఏప్రిల్ 2011 నుండి 31 మార్చి 2012 మధ్య జన్మించిన ఆడపిల్లలకు ఈ టీకాను వేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోని పీపీ యూనిట్ గది నెంబర్ 22లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

అర్హులైన బాలికలు టీకా కోసం వచ్చే సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను వెంట తీసుకొని రావాలని సూచించారు. ఈ టీకా ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరిని నేరుగా లేదా సెల్ నెంబర్ 9014932408 ద్వారా సంప్రదించాలని అధికారులు తెలిపారు.: జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు ఉచిత హెచ్‌పీవీ టీకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *