ఈ చలివేంద్ర కేంద్రాన్ని డిపో డీఎం మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేసవి తీవ్రత దృష్ట్యా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో సత్య సాయి సేవా సమితి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు.
ప్రజల సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.: నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో చలివేంద్ర కేంద్రం ప్రారంభం


