నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 131 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో సగటున 12.79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.: కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పర్యవేక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *