నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగు గ్రామంలో ప్రతిపాదిత సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే.ఎస్. శ్రీనివాస్ రాజ్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం పర్యటించింది.

నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామ పరిధిలో సుమారు 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి, దేశంలోనే అతిపెద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి అవసరమైన భౌగోళిక పరిస్థితులపై అధికారులు సమగ్రంగా చర్చించారు. నల్లమల్ల అటవీ ప్రాంత పరిసరాలు, రవాణా సదుపాయాలు, భద్రత, మౌలిక వసతులపై అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు తెలిపారు.: మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ మద్దిమడుగు దేశానికి దిక్సూచిగా మారుతుందని పేర్కొన్నారు. ఎంపీ బలరాం నాయక్ గిరిజనుల అదృష్టంగా ఈ విగ్రహ నిర్మాణం నిలుస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. పది నెలల్లో లంబాడీ సంస్కృతి ప్రతిబింబించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.↓

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *