పాలమూరు ప్రాంత చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. 1928 మార్చి 31న నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జమ్మికుంట గ్రామంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని 14 ఏళ్లకే రచనలు ప్రారంభించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయితగా కపిలవాయి లింగమూర్తి ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలమూరు జిల్లా చరిత్ర, దేవాలయాలపై ఆయన చేసిన పరిశోధనలు విశేష ప్రాధాన్యత పొందాయి. “ఆర్యా శతకం”, “మహా క్షేత్రం మామిళ్ళపల్లి చరిత్ర”, “సాలగ్రామ శాస్త్రం” వంటి గ్రంథాల ద్వారా ఆయన సాహితీ సంపదను సమాజానికి అందించారు.

జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ఆయన, వివిధ ప్రక్రియల్లో 80కి పైగా గ్రంథాలు రచించి సాహిత్య ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచారు. పాలమూరు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడిగా ఆయన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి.: పాలమూరు చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *