ఇంకుడు గుంతలు వర్షపు నీటిని నేలలోకి చొరబెట్టే ప్రక్రియకు ఉపయోగపడతాయని, దీని ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయని ఆమె వివరించారు. గ్రామాలు మరియు పట్టణాల్లో వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి లభ్యతను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం చేపట్టాల్సిన కీలక చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు.
అలాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన నీటి నిల్వలను పెంచుకోవచ్చని, ఇది కరవు పరిస్థితుల్లో రైతులకు మేలు చేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో సగటున ఐదు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతానికి తీవ్రమైన నీటి కొరత ఎక్కడా లేదని ఆమె వెల్లడించారు. అయితే భవిష్యత్తులో నీటి అవసరాలు పెరుగుతాయని, అందుకే ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
కొత్తగా బోర్లు వేయించుకునే వారు తప్పనిసరిగా ముందుగా అనుమతి తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. భూగర్భ జల శాఖ ద్వారా సాంకేతికంగా భూగర్భ జలాల స్థితిని పరిశీలించి సరైన ప్రదేశాన్ని గుర్తించి అనుమతి ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ విధానం పాటించడం వల్ల బోర్‌లో నీరు వచ్చే అవకాశాలు పెరుగుతాయని, అనవసర ఖర్చులు తగ్గుతాయని చెప్పారు.
భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. భూగర్భ జలాలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని భూగర్భ జల శాఖను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.: ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి
