జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా విధానం, ప్రభుత్వ ఆదాయం పెంపు వంటి అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని కలెక్టర్ పేర్కొన్నారు. “మన ఇసుక వాహనం” యాప్ ద్వారానే ఇసుక బుకింగ్ చేయాలని సూచించారు. ఆఫ్‌లైన్ బుకింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ విధానం అమలు చేయడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అనుమతించిన ప్రదేశాల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
వంగూరు మండలం జాజాల గ్రామంలో పట్టా భూమిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామంలో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నట్లు చెప్పారు. పర్యావరణ అనుమతుల మేరకు మాత్రమే ఇసుక రీతులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఇసుక రవాణా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
