జనవరి 26, 2026న నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని Red Fort పరిసరాల్లో జరిగిన Republic Day Parade లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, పాలెం గ్రామానికి చెందిన డాక్టర్ భీమ్ భరత్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అభినందించారు.

పాలెం గ్రామానికి చెందిన అడ్వకేట్ బోనాసి రామ్ చందర్ కుమారుడైన భీమ్ భరత్ ప్రస్తుతం ములుగు లోని RVM మెడికల్ కాలేజీలో MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా భీమ్ భరత్ నిలవడం జిల్లాకే గర్వకారణంగా మారింది.

ఈ సందర్భంగా గవర్నర్ భీమ్ భరత్‌ను ప్రత్యేకంగా సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అలాగే పాలెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి చేరిన భీమ్ భరత్ ప్రయాణం ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టపడి చదివితే ఏ స్థాయికైనా చేరవచ్చని ఆయన సాధించిన ఈ విజయం మరోసారి నిరూపించింది.: డాక్టర్ భీమ్ భరత్‌కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *