ఈ అవార్డులకు నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్ డి.ఎన్. సుమంత్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిజియోథెరపీ సేవలను ప్రథమంగా పరిచయం చేసి, అనేక మంది రోగులకు సేవలందిస్తూ ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుమంత్ మాట్లాడుతూ, తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంలో సహకరించిన తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నేషనల్ లైన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.: డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి అవార్డు
