మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు…… నాగర్ కర్నూల్…… మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించి పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయడంతో పాటు మునిసిపాలిటీలను తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు అన్నారు గురువారం మునిసిపాలిటీ పరిధిలోని 8 మరియు 24 వార్డులలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేయడం జరిగిందని వివరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత కాదని మండిపడ్డారు. బిజెపి మతతత్వంతో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతుందని మహారాష్ట్రలో డబ్బులు బిచ్చలవిడిగా ఖర్చు చేశారని విమర్శించారు. రైతులకు సంకెళ్లు వేసిన పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. దేశాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్రలు నరేంద్ర మోడీ పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ దాన్ని తిప్పి కొడుతుందని అన్నారు ఒక ఇంట్లో నలుగురు మహిళలకు పింఛన్ ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు: విజయం సాధించి హామీలు అమలు చేస్తాం Post navigation నిలదీయండి కాంగ్రెస్ ను ఓడించండి పీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం