Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

🚭 నో స్మోకింగ్ డే: పొగరహిత సమాజం కోసం అవగాహన అవసరం

పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…

సృజనాత్మకతతో మహిళలు వ్యాపార అభివృద్ధి

సృజనాత్మక ఆలోచనలతో మహిళలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను కలెక్టర్ ప్రశంసించారు.

నాగర్‌కర్నూల్‌లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మార్చి 12న సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మార్చి 12న కొత్తగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 2.5 లక్షల పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది.

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.