Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: వైద్యాధికారిణి డాక్టర్ వాణి

నాగర్ కర్నూల్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి డాక్టర్ వాణి సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.

లింగాలలో కేజీబీవీ 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేసిన వాసవి క్లబ్

లింగాల మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వాసవి క్లబ్ లింగాల ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి సీజ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.

ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ

నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.

గ్లూకోమా నివారణపై అవగాహన అవసరం: ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ

గ్లూకోమా (నీటి కాసుల వ్యాధి) వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి కంటి ఆరోగ్యంపై ప్రజలకు సూచనలు ఇచ్చిన అధికారులు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరగాలని స్పష్టం చేశారు.

ప్రజా పాలనతో నాగర్ కర్నూల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి నాగర్ కర్నూల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు

నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.